calender_icon.png 9 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె ‘పాక్’ అణు కేంద్రంపై దాడికి ఒప్పుకోలేదు

09-11-2025 01:16:31 AM

నాటి ప్రధాని ఇందిరా ఒప్పుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం

ఇండియా, ఇజ్రాయెల్ వైమానిక దాడికి సిద్ధమయ్యాయి

మాజీ సీఐఏ అధికారి రిచర్డ్ బార్లో

వాషింగ్టన్, నవంబర్8: పాకిస్తాన్ అణు విద్యుత్ కేంద్రంపై దాడికి అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆమోదం తెలపలేదని మాజీ సీఐఏ అధికారి రిచర్డ్ బార్లో పేర్కొన్నారు. ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇజ్రాయెల్ మరియు భారతదేశం పాకిసాన్‌లోని కహుటా యురేనియం కర్మాగారంపై ముందస్తు వైమానిక దాడికి ప్రణాళిక వేసాయని మాజీ సీఐఏ అధికారి రిచర్డ్ బార్లో ఆరోపించారు.

1980లలో పాకిస్తాన్ రహస్య అణు కార్యకలాపాల సమయంలో నిఘా వర్గాల్లో నివేదించబడిన ప్రణాళిక గురించి తాను విన్నానని, కానీ ఆ కాలంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనలేదని స్పష్టం చేశారు.‘నేను 1982 నుంచి 1985 వరకు ప్రభుత్వానికి దూరంగా ఉన్నాను. నేను ప్రభుత్వానికి దూరంగా ఉన్నప్పుడు అది జరిగి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక సమయంలో నేను దాని గురించి విన్నాను.

కానీ అది ఎప్పుడూ జరగలేదు కాబట్టి నేను దాని గురించి ఆలోచించలేదు‘ అని బార్లో అన్నారు.‘ఇందిరా గాంధీదానిని ఆమోదించకపోవడం బాధాకరమని, అది చాలా సమస్యలను పరిష్కరించి ఉండేది‘ అని ఆయన అన్నారు. కొన్ని నివేదికలు, బహిరంగపరచిన కథనాల ప్రకారం పాకిస్తాన్  కహుటా యురేనియం కర్మాగారంపై ముందస్తు వైమానిక దాడికి ఇండియా, ఇజ్రాయెల్ ప్రణాళిక వేసాయన్నారు.

-- ఇస్లామాబాద్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా, వాటిని ఇతర దేశాలకు సరఫరా చేయకుండా చూసేందుకు ఈ దాడి చేయాలని ప్రతిపాదనలు చేసుకున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి తన బద్ధ శత్రువైన ఇరాన్‌కు అవి అందకుండా చేయాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. అయితే ఆ కోవర్ట్ ఆపరేషన్‌కు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగీకారం తెలపలేదని అవి పేర్కొన్నాయి. అప్పటి ప్రభుత్వం దానిని అంగీకరించి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేదని తెలిపారు.

అలాగే అప్పుడు అమెరికాలో అధికారంలో ఉన్న రోనాల్డ్ రీగన్ కూడా దీనిని బలంగా తిరస్కరించేవారేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ సమయంలో ఆఫ్గానిస్థాన్‌లో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా కోవర్ట్ ఆపరేషన్ ప్రయత్నాల్లో ఉంది. వాటికి అంతరాయం కలగొచ్చనే ఉద్ధేశంతో ఇజ్రాయెల్ ప్రయత్నాలను అమెరికా తిరస్కరించి ఉండేదని చెప్పారు. పాకిస్తాన్ ఈ ఆధారపడటాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకుంది.

పాకిస్తాన్ అణుశక్తి కమిషన్  మాజీ అధిపతి మునీర్ అహ్మద్ ఖాన్ వంటి అధికారులు అమెరికాను బెదిరించే ప్రయత్నం చేశరు. అమెరికా నుంచి అందే సహాయాల్లో ఏవైనా అంతరాయాలు కలిగితే ఆఫ్గాన్ విషయంలో ఇచ్చే సహకారం దెబ్బతినొచ్చని వ్యాఖ్యలు చేసినట్లు బార్లో తెలిపారు. పాకిస్థాన్ అణు పితామహుడు ఏక్యూఖాన్ ఆధ్వర్యంలో కహుతా న్యూక్లియర్ సెంటర్ ఏర్పాటైంది. దీంతో పాకిస్తాన్ విజయవంతమైన అణ్వాయుధ అన్వేషణకు కేంద్రంగా మారింది, 1998లో దాని ’మొదటి’ అణు పరీక్షలతో ముగిసింది.