11-08-2024 08:13:59 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా తర్వాత తొలిసారి స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో అమెరికాపై షేక్ హసీనా ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని షేక్ హసీనా పేర్కొన్నారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు ఇచ్చి ఉంటే పదవిలో ఉండేదాన్నాని, బంగ్లా సార్వభౌమత్వాన్ని అమెరికాకు అప్పగించలేకే తన పదవికి రాజీనామా చేసినట్లు హసీనా తెలిపారు.
బంగ్లాదేశ్ లో మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్నారు. విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకొన్నారు. అతివాదుల మాయలోపడొద్దని ప్రజలను కోరుతున్ననని షేక్ హసీనా చెప్పారు. భగవంతుని దయవల్ల త్వరలోనే బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తాన్నాని, అవామీ లీగ్ మరోసారి నిలబడుతుందన్నారు. తను బంగ్లాదేశ్ క్షేమం కోసం ఎప్పుడూ భగవంతుడిని ప్రార్ధిస్తాన్నాని షేక్ పేర్కొన్నారు.