11-08-2024 08:47:42 PM
కర్ణాటక: గత కొన్ని రోజుల నుంచి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో కొట్టుకుపోయింది. రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోయితుంది.
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు నుంచి 6ం టీఎంసీలు, 75 క్యూసెక్కుల నీరు వృథాగా పోనుంది. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్ల నుంచి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటుతో సహా 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్యుల మేర నీటి వృథా అవుతుంది.
కర్ణాటక శివమొగ్గలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు కొనసాగుతుంది. తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుంది. తుంగభద్ర డ్యామ్ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. డ్యామ్ 19వ గేటు వద్ద తాత్కాలికంగా నీటిని ఆపేందుకు సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.