calender_icon.png 23 August, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివ.. శివా.. ఏందిది!

23-08-2025 01:35:01 AM

  1. అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్ గీతం పాడిన డీకే శివకుమార్
  2. బీజేపీకి దగ్గరవుతున్నాడని చర్చ

బెంగళూరు, ఆగస్టు 22: ఇప్పటికే వరుస పరాజయాలతో అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం కుర్చీ విషయంలో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల నడుమ కోల్డ్‌వార్ జరుగుతుందనే ప్రచారం నడుస్తున్న.

నేపథ్యంలో ఇప్పుడు కన్నడ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో చేసిన చర్యలు వైరల్ అవుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన గీతాన్ని డీకే శివకుమార్ అసెంబ్లీలో పాడి వినిపించారు. 

ఏం జరిగిందంటే..

కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ అసెంబ్లీలో ప్రసంగించారు. తన రాజకీయ జీవితం గురించి ప్రస్తావిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ గీతం ‘నమస్తే సదా వత్సలే’ను కూడా ఆలపించారు. దీంతో అందరికీ అనుమానాలు షురువయ్యాయి.

ఇప్పటికే డీకేకు సీఎం సిద్ధరామయ్యకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉందని ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ వివాదంపై డీకే శివకుమార్ స్పందించారు. ‘కట్టే కాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా’ అని తెలిపారు.