23-08-2025 01:38:44 AM
కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌కు తుమ్మల ఫోన్
రాష్ట్రానికి సరిపోను యూరియాను తీసుకురావాలి
కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): పాసుబుక్‌లను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేయాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. జిల్లాల్లో యూరియా నిల్వలు, సరఫ రాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
కేం ద్రం 50 వేల టన్నులు ఈ నెలలో సరఫరా చేస్తామన్నదని, కానీ 28,600 టన్నులు మాత్రమే కేటాయించి, అందులో 13,000 టన్నులే రాష్ట్రానికి సరఫరా చేశారని తెలిపారు. ఈ యూరియాను కూడా డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు తరలించాలని ఆదేశించారు.
యూరియా కేటాయింపులు, సరఫరా కేంద్ర పరిధిలో ఉంటుందని, కానీ ప్రతిపక్షాలు రాష్ర్ట ప్రభుత్వంపై బురద జల్లే లా ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. క్యూ లైన్‌లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.
రామగుండం నుంచి ఎరువులు
రామగుండం ఎరువుల కర్మాగారం నుం చి దాదాపు 63 వేల టన్నుల యూరియాను వెంటనే సరఫరా చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కి తుమ్మల ఫోన్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియాపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోనూ మాట్లాడారు. కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, రాష్ట్రానికి యూరియా సరఫరా అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారని తుమ్మల పేర్కొన్నారు.
టోకెన్ పద్ధతిలో యూరియా
యూరియా కొనుగో లు కేంద్రాల వద్ద క్యూ లైన్‌లు లేకుండా చూడాలని, టోకెన్ పద్ధతిలో రైతులకు యూరియా అందించాలని సూచించారు. ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉన్న యూరియాను రైతులకు అమ్మేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రైతాంగానికి భరోసాగా ఉంటామన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కో ఆపరేటివ్ కమిషనర్ సురేంద్రమోహన్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.