calender_icon.png 23 August, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ మహాధర్నా ఆరంభమే!

23-08-2025 01:05:20 AM

  1. ప్రభుత్వం టీచర్ల గోడు వినడంలేదు 
  2. 20 నెలలుగా వినతిపత్రాలకే పరిమితమయ్యాం

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ అమలు చేయాల్సిందే

నేడు ధర్నాచౌక్ వద్ద యూఎస్‌పీసీ మహాధర్నా 

విజయక్రాంతిఇంటర్వ్యూలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి

 “రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే మంచింది. లేకుంటే ఇది ఆరంభం మాత్ర మే. ప్రభుత్వం స్పందించే తీరును బట్టి మా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేస్తాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. గత 20 నెలలుగా వినతిపత్రాలకే పరిమితమయ్యాము.

మా గోడు ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్య మ కార్యాచరణకు దిగినం. అందుకే పలు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ)గా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం కో సం ఈ మహాధర్నా ద్వారా ప్రభుత్వంపై ఒత్తి డి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని’ ‘విజయక్రాంతిఇంటర్వ్యూలో టీఎస్‌యూ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి చెప్పారు.

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి) :

మహాధర్నాను ఎందుకు చేపడుతున్నారు? 

 ఉపాధ్యాయులు, విద్యారంగం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమి టీ (యూఎస్‌పీసీ) చేపట్టిన దశలవారీ పోరాటంలో భాగంగా ఈ మహాధర్నా చేస్తున్నాం. ధర్నాలో 18 సంఘాలు పాల్గొంటున్నాయి. వేలాది మంది ఉపాధ్యాయులు తమ వాణి ప్రభుత్వానికి వినపడేలా రోడ్డెక్కుతున్నారు. మాకు 31 డిమాండ్లు ఉన్నవి.

వాటిలో ప్రధానంగా విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్ల కేటాయింపు, ఓపీఎస్ అమలు, పర్యవేక్షణ అధికారుల మంజూరు, పీఎస్‌హెచ్‌ఎం పో స్టుల మంజూరు, పెండింగ్ బిల్లులు విడుదల, పీఆర్‌సీ అమలు, మోడల్ స్కూల్, గు రుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు, ఉపాధ్యాయులను పర్యవేక్షణాధి కారులుగా నియమించాలనే ఉత్తర్వులు ఉపసంహరణ, హెల్త్ కార్డుల్లాంటి సమస్యల నేకం ఉన్నాయి. వాటిని పరిష్కరించాలి.

తక్షణం తీర్చాల్సిన ప్రధాన సమస్యలేమిటి?

విద్యాశాఖలో కీలకమైన డీఈవో, డిప్యూటీఈవో, ఎంఈవో పోస్టులను ప్రభుత్వం ఇంతవరకు మంజూరు చేయలేదు. వాటిని తక్షణమే మంజూరు చేయాలి. ఉపాధ్యాయు ల ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి వాటిని అమలు చేయాలి. ఎంతో కాలంగా పెడింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలి. అదేవిధంగా రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలి. విద్యాసంస్థల్లో ఎన్జీవోల జోక్యం గత కొంతకాలంగా ఎక్కువగా ఉంది.

దాన్ని నివారించాలి. ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ జీఓనెం. 25ను సవరించాలి. ప్రాథమిక పాఠశాలల్లో 5,571 ప్రధానోపాధ్యాయుల పోస్టులు మం జూరు చేయాలి. గురుకులాల టైం టేబుల్ సవరించాలని, కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని, సీపీఎస్ రద్దు చేయాలని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేయ డంతోపాటు మరికొన్ని ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరు తున్నాం.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ఏవిధంగా ఉంటుంది?

ఉపాధ్యాయులు చేపట్టే ఈ మహాధర్నా ప్రారంభం మాత్రమే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కార మవుతాయని ఆశించాం. ఇరవై నెలలుగా వినతిపత్రాలకే పరిమితమయ్యాం. కానీ మా వినతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనివార్యంగా పోరాటానికి సిద్ధమ య్యాం.

ఇప్పటికైనా ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించి విశ్వసనీయతను నిలబె ట్టుకోవాలి. లేదంటే పోరాటం మరింత ఉధృతం చేస్తాం. కలిసొచ్చే ఇతర ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం దక్కేంత వరకు పోరాటం చేసే బాధ్యత మాపై ఉంది.

చర్చలకు పిలవగానే కార్యాచరణ వాయిదా వేస్తారనే భావన ఉంది? దీన్ని ఎట్లా చూస్తారు?

ప్రభుత్వం చర్చలకు పిలిచి హామీ ఇచ్చినప్పుడు వారిని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఉద్యమానికైనా పట్టు విడుపులు అవసరం. సమస్యలు ఒక్కరోజులోనే అన్నీ పరిష్కారం కావు. కొన్ని పరిష్కారమవుతాయి. మరికొన్ని కొత్తవి వస్తుంటాయి. అయితే కాస్త అటూ ఇటుగా సమస్యలు పరిష్కారం చేస్తే ప్రభుత్వం పట్ల విశ్వాసం పె రుగుతుంది.

లేకపోతే అసంతృప్తి పెరుగుతుంది. అప్పుడు కూడా సంఘాలు మౌనం గా ఉంటే సంఘాలపైన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సంఘాలు కూడా విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుం ది. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం అసంతృప్తిని మూ టగట్టుకుంటోంది. 

తెలంగాణ ఉద్యోగుల జేఏసీలో ఉన్నా కార్యచరణను వేరుగా ఎందుకు చేపట్టాల్సి వచ్చింది?

మీరన్నట్లుగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీలో మేం భాగస్వాములమే. ఉద్యోగ జేఏసీ లో భాగస్వాములుగా ఐక్యంగా పోరాడు తాం. అయితే ఉపాధ్యాయ, విద్యారంగా నికి సంబంధించిన ప్రత్యేక సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలుగా విడిగా పోరాడుతాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల్లో కొన్నింటిని ఇక్కడ వేరుగా చూడాల్సి ఉం టుంది. కొన్ని సమస్యలపై ప్రత్యేక కేంద్రీకరణ అవసరం కూడా. కనుక విడిగా పోరా డుతున్నాం. మాపోరాటం జేఏసీ పోరాటాన్ని బలపరిచేదే తప్ప వ్యతిరేకంగా జరిగేది కాదు. వారితోనూ కలిసి పోరాడుతాం.

ఈ ప్రభుత్వం వచ్చాక విద్య, పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉంది?

ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలో ఉంది. రాష్ర్ట ప్రభుత్వాలు గురుకులాలకు ఇచ్చే ప్రా ధాన్యతను సాధారణ ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం కూడా ఈ వి ధంగానే చేసింది. లక్షలాది మంది విద్యార్థు లు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడంలేదు.

పాఠశాలల్లో మౌలిక వసతులు లేక కునారిల్లుతున్నాయి. సర్కారు బడులపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. అం దుకు అనేక కారణాలున్నాయి. విద్యకు రాష్ర్ట బడ్జెట్లో కనీసం 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అ మలు చేయలేదు. కేవలం 7.55 శాతం మా త్రమే కేటాయించి చేతులు దులుపుకుంది.    

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే  ఏం చేయాలి? 

 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, పర్యవేక్షణ పెంచి నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలిగించాలి. పాఠశాలలను పాఠశాలల అభివృ ద్ధిలో పౌరసమాజం భాగస్వామ్యం పెరగాలి. ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని నియంత్రించా లి. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరగాలి.

నాణ్యమైన విద్యకు భరోసా కల్పిం చాలి. ఇప్పటికే ఉపాధ్యాయులు అలా పనిచేస్తున్న పాఠశాలల్లో ఫలితాలు ఆశాజనకం గానే ఉన్నాయి. మారుతున్న సాంకేతికను అందిపుచ్చుకొని విద్యాబోధనలో మార్పు లు రావాల్సి ఉంది. ఉపాధ్యాయ సంఘాలు సైతం ఉపాధ్యాయుల్లో పని సంస్కృతి పెరగటానికి ప్రోత్సహించాలి.

విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నా ఆ స్థాయిలో పనితీరు ఉందా?

ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ ను నిర్వహించటం సంతోషమే. ఇది కేం ద్రీకరణ విద్యారంగం అభివృద్ధికి దోహదపడుతుంది. అధికారులతో తరచుగా సమీక్షలు చేస్తున్నారు. అయితే సంఘాలతో మాత్రం చర్చలు జరపడం లేదు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపితే క్షేత్రస్థాయి సమస్యలు, వాటి పరి ష్కార మార్గాలు తెలుస్తాయి. విద్యాశాఖ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుం ది.

కానీ ఆ విధంగా ఎక్కడా కూడా జరగడంలేదు. జీఓ నెం.25ను సవరించాలి. ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ వర్క్‌లోడ్‌కు అనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలి. ఇంతవరకు కొత్త జిల్లాలకు డీఈవో పోస్టులు, డిప్యూటీ ఈవో పోస్టులు, ఎంఈవో పోస్టులను మంజూరు చేయలేదు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.

ఎన్‌ఈపీని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు?

కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన ఎన్‌ఈపీ (నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ)-2020 పేదలకు విద ్యను దూరం చేస్తుంది. తద్వారా కేం ద్రీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ పెరిగిపోతుంది. రాష్ట్రాల హక్కు లు హరించబడతాయి. శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం తదితర రాజ్యాంగ విలువలు దాంతో దెబ్బతింటాయి.

అందుకే ఎన్‌ఈపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సామాజిక న్యాయం, లౌకిక విలువలు పెం చేలా విద్యారంగం ఉండాలి. శాస్త్రీయమైన పద్ధతిలో ఎన్‌ఈపీ- 2020ని సమూలంగా మార్చాలి. అందరికీ సమానమైన ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలి. ఎన్‌ఈ పీ-2020ని రద్దు చేయాలి.