23-08-2025 01:04:51 AM
మంగపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం భోజన వసతి ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.