01-08-2025 12:00:00 AM
మంథని, జూలై 31(విజయ క్రాంతి): మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియామకమైన కుడుదుల వెంకన్నను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంఘ డైరెక్టర్లు శాలువాతో ఘనంగా సత్కరించినారు. గురువారం మంథని ఏఎంసి కార్యాలయంలో వెంకన్న ను డైరెక్టర్లు కన్నేబోయిన ఓదెలు, ఎండి అంకుస్, రావికంటి వెంకటేష్ లతో పాటు పాలక వర్గాన్ని శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపానారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుధ్దిళ్ళ శ్రీధర్ బాబుకు నమ్మిన బంటుగా ఉంటూ గత ఎన్నిక ల్లో మంత్రి శ్రీధర్ బాబు విజయంలో వెంకన్న కీలక పాత్ర పోషించారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకన్నకు కాంగ్రెస్ పార్టీ ద్వారా తగిన గుర్తింపు లభించిందన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు కొత్త శ్రీనివాస్, లెక్కల కిషన్ రెడ్డి, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, నాయకులు ఊదరి శంకర్, పెంటరి రాజు, సాదుల శ్రీకాంత్, దొరగోర్ల శ్రీనివాస్, మంథని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్, నాయకులు పర్శవేని మోహన్,ఆరెల్లి వరుణ్, తదితరులు పాల్గొన్నారు.