31-10-2025 11:21:56 PM
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి
చిట్యాల,(విజయ క్రాంతి): అకాల వర్షం మూలంగా తడిసి రంగు మారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతుల సమస్య పరిష్కరించాలని, ధాన్యం కొనుగోలను వేగవంతం చేసి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక రామన్నపేట వ్యవసాయ మార్కెట్లో సిపిఎం-రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షం మూలంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన రాశులు వర్షానికి తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయరన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతుల ఖాతాలో 48 గంటల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.