calender_icon.png 1 November, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

01-11-2025 12:00:00 AM

మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు పాపిశెట్టి రాము 

అమనగల్లు, అక్టోబర్ 31: విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు పాపిశెట్టి రాము అన్నారు. టి ఎస్ ఎస్ ఓ ఆధ్వర్యంలో ఈ నెల 12న అమనగల్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ వద్దు మన భవిష్యత్తు ముద్దు అనే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు నిర్వాహకులతో కలిసి శనివారం పాపిశెట్టి రాము విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువత తాము అనుకున్న లక్ష్యాల వైపు ప్రయాణించి గమ్యం చేరుకోవాలని కానీ కొంతమంది యువకులు, విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న టి ఎస్ ఎస్ ఓ సభ్యులను ఆయన అభినందించారు.

కార్యక్రమం లో  పెద్ద ఎత్తున విద్యార్థులు యువత రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఫిలిం డాన్సర్ ప్రభుశంకర్,టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మీసాల చిక్కి( బాల వర్షిత్), బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మకొండ రాజు, నాయకులు వస్పుల సురేష్, మీసాల గోపాల్, వస్పుల లక్ష్మణ్ పాల్గొన్నారు