15-07-2025 01:12:03 AM
- నా పూజల్లో లోపాలు.. అందుకే మరణాలు
- ఆ విషయంలో నేను అడ్డుపడను
- వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి
- ఉజ్జయిని మహంకాళి రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): “నన్ను కొలిచే బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. నా భారతదేశాన్ని, తెలంగాణను కాపాడే బాధ్యత నాదే. కానీ, నా పూజల్లో లోపాలు చేస్తున్నారు, అందుకే మరణాలు పెరుగుతున్నాయి. ఆ విషయంలో నేను అడ్డుపడను. నాకు రక్తం చూపించాలి లే దంటే ఊరుకోను” అంటూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తన భవిష్యవాణిని వినిపిం చారు. ఆనందం, ఆందోళన కలగలిసిన వాక్కులతో భక్తులకు దిశానిర్దేశం చేశారు.
సికింద్రా బాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అనంతరం సోమవారం ఉదయం జరిగిన రం గం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. “ఈ ఏడాది సమర్పించిన బోనాల ను సంతోషంగా స్వీకరించాను. కానీ, ప్రతి ఏడాదీ ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారు. నా కోరిక చెపుతున్నా లెక్కచేయడం లేదు. తల్లిదండ్రులు పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. అయినా నా బిడ్డలుగా భావించి నేనే కాపాడుకుంటున్నాను.
రాబోయే రోజుల్లో ఒక మహ మ్మారి రాబోతోంది, ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయి. నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు, అందుకే మరణాలు పెరుగుతు న్నాయి. ఆ మరణాలను నేను అడ్డుకోను. ఎవరికి ఏది రాసిపెట్టి ఉందో అది అనుభవించి తీరాల్సిందే. నాకు రక్తం బలి కావాలి. ప్రాణనష్టం కలిగించను కానీ, మీరు రక్తం చూపించ కపోతే నేనే రక్తాన్ని చూపిస్తాను. నాకు రావలసిన రూపాయికి కూడా అడ్డుపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పాడిపంటలకు ఎలాంటి ఢోకా లేదు. అందరూ సుఖసంతోషాలతో ఉంటారు. మీరందరూ ఐదు వారాల పాటు పప్పు, బెల్లంతో నాకు సాక పెట్టండి. విధిగా పూజలు జరిపించండి, అంతా శుభమే జరుగుతుంది” అని భవిష్యవాణి వినిపించారు.
అంబారీపై అమ్మవారు.. అంబరాన్నంటిన సంబరం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అ మ్మవారి బోనాల జాతర రెండో రోజు సోమవారం అంబరాన్నంటిన సంబరాల మధ్య ముగిసింది. గజరాజు ‘లక్ష్మీ’పై అమ్మవారి చిత్రపటంతో సాగిన అంబారీ సేవ, భక్తి ప్రపత్తుల తో నిర్వహించిన ఘటం ఊరేగింపు కనులపండువ చేశాయి. మేళతాళాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలతో సికింద్రాబాద్ వీధులు జనసంద్రంగా మారాయి. గతంలో సేవలో పాల్గొన్న రూపవతి ఏనుగు అనారోగ్యానికి గురవడంతో ఈసారి జూపా ర్క్ నుంచి లక్ష్మీ అనే ఏనుగును ప్రత్యేకంగా తెప్పించారు.
సర్వాంగ సుందరంగా అలంకరించిన అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. ఏపీ తాడేపల్లిగూడెం కళాకారుల విభిన్న వేషధారణల ప్రదర్శనలు ఊరేగింపునకు కొత్త శోభ ను తెచ్చాయి. వేలాది మంది భక్తులు అమ్మవారికి జేజేలు పలుకుతూ ఊరేగింపులో పా ల్గొన్నారు. అనంతరం, ఆనవాయితీ ప్రకారం అమ్మవారి చిత్రపటాన్ని మెట్టుగూడ ఆలయానికి తరలించారు. సా యంత్రం ప్రారంభమైన ఫలహారం బండ్ల ఊరేగింపులు సికింద్రాబాద్ వీధులను హోరెత్తించాయి.
ఘనంగా రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు: డాక్టర్ కోట నీలిమ
సనత్‌నగర్:- తెలంగాణ ప్రజల ఆత్మభిమానానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండగ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వైభవంగా జరిగాయని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పండగలో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి బోనం సమర్పించారని పేర్కొన్నారు.
జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యర్యంలో పవిత్రమైన రంగం కార్యక్రమం నిర్వహించామని.. ఇందులో భాగంగా అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారని పేర్కొన్నారు. రంగం అనంతరం అంబారీపై అమ్మవారి ఊరేగింపు, బలిపూజ, గావు పట్టడం కార్యక్రమాలు ఘనంగా జరిగాయని తెలిపారు. బోనాల విజయవంతానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులను అభినందించారు. బోనాల నిర్వహణకు బడ్జెట్ కేటాయించి ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు కోట నీలిమ.