calender_icon.png 14 November, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రవణ్ అరెస్ట్ అప్రజాస్వామికం

20-05-2024 01:12:01 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (విజయక్రాంతి) : మల్కాజిగిరి కార్పొరేటర్, బీజేపీ నేత శ్రవణ్‌ను ప్రభుత్వం కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరిలో శ్రవణ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరె స్టు చేయడం సబబు కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిం చారు.

రెండు పార్టీల కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొడుతామని, మల్కాజి గిరిలో బీజేపీ గెలుస్తుందనే ఉద్దేశంతోనే వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అప్రజాస్వామిక పద్ధతులను అవలంభిస్తున్న వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఎప్పుడూ కొనసాగుతున్నదని తెలిపారు. అంతకు ముందు ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్‌పూర్ డివిజన్ మహాత్మా నగర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ నేతల దాడిలో గాయ పడ్డ బీజేపీ కార్యకర్త గోకారం లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.