14-11-2025 12:13:23 AM
‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియాశరణ్ టాలీవు డ్‌లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న ఈమె మళ్లీ ఇప్పుడు జోరు పెంచింది. ఇటీవల ‘మిరాయ్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన శ్రియా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది.
శ్రియా చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ‘నాన్ వైలెన్స్’ ఒకటి. తమిళ హీరో మెట్రో శిరీష్ కథానాయకుడిగా దర్శకుడు ఆనందకృష్ణ రూపొందుతున్న సినిమా ఇది. పాన్‌ఇండియా స్థాయిలో బహుభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ‘కనకం’ అనే ఓ ప్రత్యేక గీతం గురువారం విడుదలైంది. ‘కనకం కన్నే కొడితే కసా పిసా అయిపోతారు.. అందం ఆరబోస్తే కొంపాగూడు వదిలేస్తారు.. పోకిరి కుర్రోళ్లంతా నా టచ్చుకై చస్తుంటారు.. పెళ్లున మొగాళ్లుతై పెళ్లాన్నైనా వదిలేస్తారు..’ అంటూ సాగుతున్న ఈ పాటకు భాష్యశ్రీ సాహి త్యం అందించారు.
ఈ పాటను తేజస్విని నంది భట్లతో కలిసి ఆలపించిన యువన్ రాజా స్వరాలు కూడా సమ కూర్చారు. ఈ పాటలో శియా శరన్ అందచందాలతో ఆకర్షి స్తోం ది. అప్పట్లో దేవదాసు, కొమరం పులి, తులసి వంటి సినిమాల్లో ప్రత్యేక గీతాలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు 43 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోతకూ సై అంటూ, ఐటమ్ సాంగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నెట్టింట ఆసక్తికర చర్చకు తెర తీసింది.