calender_icon.png 14 November, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

14-11-2025 12:11:32 AM

  1. ప్రజా సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం

రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క.

ములుగు,నవంబర్13(విజయక్రాంతి)ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలో కోటి 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్, 50లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ లకు,15లక్షల రూపాయలతో నిర్మించనున్న తెలంగాణ గెజిటెడ్ భవనానికి,10లక్షల రూపాయలతో నిర్వహించనున్న నాన్ గెజిటెడ్ భవనానికి, గట్టమ్మ వద్ద మూడు కోట్ల 62 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న 33/11 తేదీ విద్యుత్ ఉపకేంద్రానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేయగా, 61లక్షల రూపాయలు ఏర్పాటుచేసిన బండారిప ల్లి జంక్షన్, సుందరీకరణ పనులకు, ఐ లవ్ యు ములుగు సింబల్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలలో మంత్రి సీతక్క మాట్లాడుతూ తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మీ ఆడబిడ్డగా ఆదరించాలని కోరారు. గతంలో తాను ఎ మ్మెల్యేగా ఉన్నప్పటికీ నిధుల కొరత కారణ ంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చే యలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ, నేడు మంత్రిగా ప్రజా ప్రభుత్వంలో కొనసాగుతూ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి వివిధ పనులను చేపట్టడం జరుగుతున్నదని వివరించారు.

ఇప్పటికే జిల్లాలో 50కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని, మరో 50 కోట్ల రూ పాయలను మంజూరు చేయించి మిగిలిన రోడ్డు పనులను పూర్తి చేస్తానని హామీ ఇ చ్చారు. అన్ని కులాల వారు వారి వారి దేవతలు నెలకొన్న ఆలయాలకు ప్రత్యేక నిధు లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటికే ములుగు మండలం జంగా లపల్లి క్రాస్ రోడ్డు వద్ద రామప్ప శిల్పాలతో కూడిన సింబల్ ను ఏర్పాటు చేయడంతో పాటు శివుడి లింగం ఏర్పాటు చేయడం జ రుతుందని,ఇవి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని,అదే తరహాలో ము లుగులో ఐ లవ్ యు ములుగు పేరుతో సిం బల్ చూడముచ్చటగా ఉందని కొనియాడా రు. ఇలాంటి సింబల్ లను పర్యాటక ప్రాం తంగా అభివృద్ధి చెందిన ములుగు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు.

ములుగు ప్రాంతానికి ఘట్టమ్మ గుట్ట తలమనికంగా ఉంటుందని మన ప్రాంతానికి వచ్చే శాసనసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు విశిష్ట అతిథలు భక్తులు ఉన్నత అధికారులు పర్యాటకులు మొదటగా గట్టమ్మ తల్లిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తుందని అదే విధంగా ఈ ప్రాంతంలోనే నూతనంగా సమీకృత కలెక్టరేట్ నిర్మాణం,మెడికల్ కాలేజ్, జిల్లా కోర్టు సముదాయం,గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణాలు జరుగుతుండటంతో ఈ ప్రాంతం ఒక సింబాలిక్ గా మారిందని పేర్కొన్నారు.ములుగు జిల్లాలో ఒక హబ్ గా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు.