calender_icon.png 31 December, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంపెనీ నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదు

31-12-2025 01:55:12 AM

భద్రతా ప్రమాణాలను నిక్కచ్చిగా పాటించాం

హైకోర్టులో వాదనలు వినిపించిన సిగాచి యాజమాన్యం

సంగారెడ్డి, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిగాచి కంపెనీలో భారీ పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా కంపెనీ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేయడమే కాకుండా కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ విషయం లో సిగాచి ఇండస్ట్రీస్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ ప్రకారం కంపెనీ పక్షాన ప్రధాన వాదనలు వినిపించారు.  జూన్ 30న జరిగిన సంఘటనను ఒక దురదృష్టకరమైన “పారిశ్రామిక ప్రమాదం”గా కంపెనీ పేర్కొంది. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదని కంపెనీ వాదించింది.  

నష్టపరిహారం చెల్లింపు

చనిపోయిన, మిస్సింగ్ అయిన ప్రతి కా ర్మికుడి కుటుంబానికి కంపెనీ తరఫున రూ. 42 లక్షల పరిహారం చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఇందులో ఇప్పటికే ప్ర తి కుటుంబానికి సుమారు  25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నగదు రూపంలో చెల్లించామంది. ప్రభుత్వం ప్రకటించిన రూ. కోటిలో మిగిలిన భాగాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. తమ ఫ్యాక్టరీకి అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయని, ప్రమాదం జరిగిన సమ యంలో అమలులో ఉన్నాయని తెలిపింది.  ఈ కేసును ‘ప్రజా ప్రయోజన వ్యా జ్యం’గా పరిగణించకూడదని కంపెనీ వా దించింది. కేసును బుధవారం వాయిదా వేశారు.