calender_icon.png 8 July, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా పెరిగిన వెండి ధర..

13-08-2024 01:43:22 AM

అదే బాటలో బంగారం..!

ముంబయి: సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.200 వృద్ధి చెంది రూ.72,350లకు చేరుకున్నది.మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.1000 పెరిగింది. ఇంతకుముందు శనివారం సెషన్ లో తులం బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ.72,150 వద్ద నిలిచింది. శనివారం కిలో వెండి ధర రూ. 82,500 పలుకగా, సోమవారం రూ. 83,500లకు పెరిగింది. మరోవైపు తులం బంగారం (99.5 శాతం స్వచ్ఛత) ధర రూ. 200 పెరిగి రూ.72 వేల వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్ తోపాటు స్థానిక బులియన్ మార్కెట్లో ఆభరణాలకు గిరాకీ పెరగడం వల్లే బంగారం ధర పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.