29-08-2025 02:14:39 AM
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాం తి) : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ పి.శ్రీహరి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్‌లలో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను అక్టోబర్ 6 నుంచి 13 వరకు నిర్వహిస్తామన్నారు.