30-07-2025 01:43:38 AM
పుట్టినరోజున 225 మొక్కలు నాటిండు
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సింగరేణి సీఎండీ బలరాం అరుదైన రికార్డును సృష్టించారు. ఆరేళ్ల క్రితం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన మంగళవారం నాటికి 20వేల మొక్కలను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం కొత్తగూడెం ఏరియాలోని జేకే ఓపెన్ కాస్ట్ వద్ద ఏకబిగిన 225 మొక్కలను నాటారు.
అంతర్జాతీయ సంస్థ అయిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధు లు ఈ మేరకు ఆయనకు ఓ సర్టిఫికెట్‌ను అందించారు. సివిల్ సర్వెం ట్స్‌లో ఈ రికార్డు సృష్టించింది బల రాం మాత్రమేనని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఎండీ సత్యవోలు రాంబాబు వెల్లడించారు.