12-08-2025 10:17:05 PM
విద్యకు దూరమైన వారికి బాసటగా కాకతీయ పాఠశాల నిలుస్తోంది..
కాకతీయ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ ఏషబోయిన సాంబయ్య యాదవ్..
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలోని కాకతీయ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. చదువుకోవాలని ఆసక్తి ఉండి అవకాశాలు లేక, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, రోజువారీ స్కూల్/కాలేజీకి వెళ్లలేక ఇలా కారణమేదైనా విద్యకు దూరమైన వారికి బాసటగా మా కాకతీయ ఉన్నత పాఠశాల బాసటగా నిలుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ములుగు జిల్లా కేంద్రం స్థానికంగానే కాకతీయ ఉన్నత పాఠశాలలో నామమాత్రపు ఫీజుతో దూరవిద్యను అందిస్తున్నాము రెగ్యులర్ సర్టిఫికెట్తో సమానమైన ఈ విద్యను వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకునేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
ఈ సందర్భంగా కాకతీయ ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ ఏషబోయిన సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ.. చదువుకు దూరమైన వారికి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి కాకతీయ ఉన్నత పాఠశాల అండగా నిలుస్తోందని. రెగ్యులర్గా పదో తరగతి, ఇంటర్ ఫెయిలైన వారు, వివిధ కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారు తక్కువ విద్యార్హతతో ఏళ్ల తరబడి చిరుద్యోగం చేస్తున్న వారు,వ్యాపారులు,బాలికలు,గృహిణుల,అంగన్వాడీ వర్కర్లు,ఆశా వర్కర్లు,ఆయాలు,దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా చేరవచ్చు.ఇంటర్ లోని గ్రూపులు సీఈసీ, హెచ్ఈసీ,ఎంఈసీ అందుబాటులో ఉన్నాయి చివరి తేదీ ఈనెల15 వరకు ఉంది .గతంలో ఈ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం మన ములుగులోనే ఉందని అన్నారు ఆశక్తి గల వారు ధరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలకు ఈ 8978916637, 9505478073 కు సంప్రదించండి