12-08-2025 10:27:13 PM
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన మిగిలిపోయిన భూసేకరణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(District Collector Badawat Santosh) ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ శాఖల అధికారులతో భూసేకరణ అంశంపై సమీక్ష నిర్వహించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణను వచ్చే 15 రోజుల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం మూడు శాఖల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్, నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల సీఈ విజయ్ భాస్కర్ రెడ్డి, ఈఈ మురళి తదితరులు పాల్గొన్నారు.