12-08-2025 10:20:16 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ(Sri Rajarajeshwara Swamy Temple) అనుబంధ శ్రీ భీమేశ్వరాలయంలో 100వ మంగళవారం వైభవంగా జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వరాలయంలో, ప్రతీ మంగళవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుచున్న హనుమాన్ చాలీసా పారాయణం, నేటితో 100వ మంగళవారంకు చేరినందున, నిర్వాహకులు అత్యంత శోభాయమానంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా రాజన్న ఆలయం ముందు నుండి భీమేశ్వరాలయం వరకు నగర సంకీర్తన నిర్వహించి, అనంతరం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9:00 గంటల నుండి మొదలుకొని రాత్రి 9:00 గంటల వరకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం సామూహికంగా కొనసాగనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భక్తులు, ప్రతి మంగళవారం ఇక్కడ జరుగుతున్న పారాయణంలో భాగస్వాములవుతున్నాం అని హర్షం వ్యక్తం చేశారు.