21-07-2024 05:17:33 PM
హైదరాబాద్ : సింగరేణి ఎక్స్ టర్నల్ నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సింగరేణి సంస్థలో 10 కేటగిరీల్లోని 272 సింగరేణి ఎక్స్ టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా జూలై 20,21వ తేదీల్లో కంప్యూటర్ బేస్ట్ టేస్ట్(సీబీటీ) నిర్వహించనునట్లు సంస్థ సీఎండీ బలరాం పేర్కొన్నారు. ఈ పరీక్షను రాసేందుకు 12,045 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు రోజులుగా జంట నగరాల్లోని 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కీ ని త్వరలోనే విడుదల చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం వెల్లడించారు.