04-07-2025 07:58:25 PM
టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏరియా జిఎం కి వినతి పత్రం అందచేత
మందమర్రి, (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా విధులు నిర్వహిస్తు సంస్థ అభివృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి యాజమాన్యం కంపెనీ క్వార్టర్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మిట్టపల్లి మధు, సత్యగౌడ్ లు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఏరియా జిఎం దేవేందర్ కు వారు వినతి పత్రం అందచేశారు. ఈ సంద ర్బంగా వారు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు అహర్ని శలు ప్రజా సమస్యలపై పోరా డుతూ, తమ సమస్యలను పరిష్కరించుకోలేక పోతున్నా రని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సింగరేణి యాజమాన్యం మానవత దృక్పథంతో ఆలోచించి జర్నలిస్ట్ లకు సంస్థ క్వార్టర్లు కేటాయించాలని కోరారు.