04-07-2025 07:54:46 PM
టీఏపీయూఎస్ జిల్లా అధ్యక్షులు పర్వతం సంధ్యా రాణి
కోదాడ: మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పర్వతం సంధ్యారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం టీఏపీయూఎస్ సభ్యత్వ అభియాన్ లో భాగంగా మునగాల నడిగూడెం మండలాల్లో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అంతేకాకుండా వారి సమ్మె కాలపు వేతనాన్ని కూడా చెల్లించాలని,వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని ,ఉద్యోగ ఉపాధ్యాయులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కోరారు.