calender_icon.png 8 November, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో చైతన్యం.. డ్రగ్స్‌పై యుద్ధం ర్యాలీ..

08-11-2025 12:20:53 AM

ప్రారంభించిన ఎఎస్పీ క్రాంత్ కుమార్ సింగ్

భద్రాచలం, నవంబర్ 7, (విజయక్రాంతి) భద్రాచలం పట్టణంలో శుక్రవారం నాడు చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం పేరుతో భద్రాచలం టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశం మేరకు భద్రాచలం ఏ ఎస్ పి కాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యం లో భద్రాచలం కాలేజీ గ్రౌండ్ నుండి బస్టాండ్ వరకు అక్కడ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం అంబేద్కర్ సెంటర్లో విద్యార్థులు పోలీసులు సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో మానవ ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో డ్రగ్స్ కి పలువురు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని కోరుకుంటూ డ్రగ్స్ కి దూరంగా విద్యార్థులతో పాటు అందరూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ నాగరాజు పట్టణ ఎస్త్స్రలు సతీష్ శ్యాం ప్రసాద్ ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతి తో పాటు పలువురు పాల్గొన్నారు.