08-11-2025 12:16:52 AM
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రోల్ మోడల్
లాంగ్-టర్మ్ వాల్యూక్రియేషన్, కో-క్రియేషన్‌కు ప్రాధాన్యం
‘అమెరికా - యూటా’ రాష్ర్ట పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన ‘తెలంగాణ’లో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా-యూటా పారిశ్రామికవేత్తలను రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ -యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని యూటా పారిశ్రామిక వేత్తల బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును ప్రత్యేకంగా కలిసింది.
టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సెన్సైస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో ‘యూటా- తెలంగాణ’ మధ్య ద్వుపాక్షిక సహకారం, నైపు ణ్య మార్పిడికి గల అవకాశాలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ సంద ర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాక, గ్లోబల్ ఎకానమీకి సపోర్ట్ ఇచ్చేలా, లాంగ్-టర్మ్ వాల్యూ క్రియేషన్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తీసుకొచ్చిన సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఏయే రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం, పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే ప్రో త్సాహకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం టీ--హబ్, టీ--వర్క్స్, వీ-హబ్‌లను వరల్డ్ ట్రేడ్ సెంటర్ -యూటా, సిలికాన్ స్లోప్స్ అండ్ యూటా టెక్ స్టార్టప్‌లతో అనుసంధానించేలా చొరవ చూ పాలని ప్రతినిధి బృందాన్ని ఆయన కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ర్టంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉ మ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘యూటా’తో దీర్ఘకాలిక భాగస్వామ్యం నిర్మిస్తాం
‘యూటా’ రాష్ర్టంతో పటిష్టమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ద్వుపాక్షిక సహకారం పెట్టుబడులకే పరిమితం కాకుండా ఇన్నోవేషన్, స్కిల్స్, టెక్నాలజీ రంగాల్లోఉమ్మడి ఆవిష్కరణలకు దిక్సూచిగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. తెలంగాణ లాంటి ఫాస్ట్-గ్రోయింగ్, డైనమిక్, ప్రో- యాక్టివ్ రాష్ర్టంతో కలిసి పని చేసేందుకు ‘యూటా’ సిద్ధంగా ఉందని డేవిడ్ కార్లెబాగ్ తెలిపారు.
రాబోయే రోజుల్లో ద్వుపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడి విషయంలో తెలం గాణతో కలిసి చురుగ్గా పని చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూటా హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ జేసన్ థాంప్సన్, మాట్ మాక్‌ఫెర్సన్, నికోల్ మాక్‌ఫెర్సన్, లైఫ్ టైం ప్రెసి డెంట్ బీజే హాకే, జేకేడీ ప్రెసిడెంట్ మైక్ నెల్సన్, మోనెరె ఏఐ సీఈవో, కో-ఫౌండర్ మౌ నంది, భారత్ వ్యాలీ అడ్వుజర్లు స్టీవ్ వుడ్, సున్‌హాష్ లోడే, ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ ఫౌండర్ లక్ష్మీనారాయణ, ఐఐఆర్‌ఎఫ్ గురు సౌలే పాల్గొన్నారు.