calender_icon.png 8 November, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

08-11-2025 12:17:58 AM

కొత్తగూడెం, నవంబర్ 7, (విజయక్రాంతి):భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈనెల 16వ తేదీన నిర్వహించనున్న ‘మెగా జాబ్ మేళా‘ పోస్టర్ ను శుక్రవారం  కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం సాలెం రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ,. ఈనెల 16న కొత్తగూడెం క్లబ్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన ‘మెగా జాబ్ మేళా‘ జరుగనుందని, ఈ జాబ్ మేళా కార్యక్రమము  ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో,  కొత్తగూడెం ఏరియా సింగరేణి వారి సహకారంతో  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న  పోస్టులను భర్తీ  చేస్తారన్నారు .నిరుద్యోగ యువత ఈ మెగాజాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై జీవనభృతికి అవసరమైన ఉద్యోగాలను ఎంచుకోవాలన్నారు.పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, ఫార్మసీ వంటి అర్హతలతో 18 నుండి 40 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు అర్హులన్నారు.

భ్యర్థులు జాబ్ మేళాకు హాజరయ్యేటప్పుడు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, వాటి జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలన్నారు.    ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం ఎం. షాలేం రాజు తో పాటు కొత్తగూడెం ఏరియా ఎఐటియూసి బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జున రావు, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి. రజాక్,  ఎస్‌ఓటు జిఎం జివి కోటిరెడ్డి, ఎజిఎం ( సివిల్) సిహెచ్ రామకృష్ణ, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణ రాజు, డిజిఎం  (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం (ఐఈ) ఎన్. యోహాన్, డివై పిఎం జి. హరీష్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.