calender_icon.png 12 September, 2024 | 11:44 PM

కరకగూడెం అడవుల్లో భారీ ఎన్కౌంటర్

05-09-2024 11:05:42 AM

ఆరుగురు నక్సల్ లైట్లు మృతి

దళ కమాండర్ తో పాటు ఐదుగురు సభ్యులు మృతి 

భద్రాద్రికొత్తగూడెం,విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం కరకగూడెం,గుండాల మండలల సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందారు. ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయాల పాలయ్యారు. కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో గ్రేహండ్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో, మావోయిస్టు లచ్చన్న దళం తటస్థ పడింది. పోలీసులకు నక్సలైట్లకు హోరాహోరు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దళ కమాండర్ లచ్చన్న తోపాటు మరో ఐదుగురు దలసభ్యులు మృతి చెందారు. గ్రాండ్ పోలీస్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాల పాలయ్యాడు. మృతి చెందిన నక్సల్స్ ను శవపరీక్ష నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారీగా మందు గుండు సామాగ్రి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.