calender_icon.png 24 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

24-12-2025 12:19:58 AM

  1. జిల్లాలో 2.20 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం 
  2. కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 2.20 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేపపిల్లల విడుదల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథు లు జిల్లా మత్స్యకార సహకార సంఘాల నాయకులతో కలిసి నల్లచెరువులో లక్ష చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ మత్స్యకా రుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో 2.20కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.

నల్ల చెరువులో ఈరోజు లక్ష చేప పిల్లలను విడుదల చేసి, జిల్లాలో ఈ ప్రక్రియను ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు. చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలోని మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం కోసమే ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మొత్తం రెండు కోట్ల 20 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ః ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి క్రైమ్, డిసెంబర్ 23 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి పట్టణ  శివారు ఒశ్యాతండాలో ఏర్పాటు చేసిన గొర్రెల, మేకలలల్లో నట్టల నివారణ మందుల కంపెనీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. జిల్లా మొత్తంలో 11 లక్షల 35వేలగొర్రెలు మేకలు ఉన్నాయని వీటికి మందులు పంపిణీ చేయడానికి జిల్లా వ్యాప్తంగా 265 ఆవాస ప్రాంతాలలో 33 టీంలను ఏర్పాటు చేసి మందులు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇందులో 20 లక్షల 40వేల ఖర్చుతో మూడు రకాల మందులను జీవాలకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గొర్రెలకు నట్టల నివారణ మందును తాగించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం యాదవుల అభివృద్ధి పేరున అందిన కాడికి దోచుకుని ఈ యాదవ సోదరులకు తీరని నష్టం చేకూర్చిందన్నారు. గొర్రెల పంపిణీ పథకం చేపట్టి అమాయక యాదవ సోదరుల పైన అందిన కాడికి దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

నేడు ఇందిరమ్మ రాజ్యంలో యాదవుల అభివృద్ధి కోసం పలు రకాల కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య,  మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యాదవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.