calender_icon.png 24 December, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలకు విస్తరించిన బీజేపీ

24-12-2025 12:21:21 AM

  1. పంచాయితీల్లో పెరిగిన బలం

భవిష్యత్‌లో తెలంగాణలో అధికారం ఖాయం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్ పాండు రెడ్డి

నారాయణపేట, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : రాష్ట్రంలో బిజెపి పంచాయితీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిందనీ,రాబోయే. ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తకాపు రతంగ్ పాండు రెడ్డి ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.ఇద్దరు ఎమ్మెల్యేల సోతూర్లలో కాంగ్రెస్ ను ఓడించి బిజెపి ఘన విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.సీఎం సొంత నియోజ కవర్గం కొడంగల్ లో సైతం పలు గ్రామాలు బీజేపీ కైవసం చేసుకుందని అన్నారు. గతంతో పోల్చితే భారీగా పెరిగిన బీజేపీ గ్రాఫ్ పెరిగిందని అన్నారు.

ప్రతి గ్రామానికి బిజెపి విస్తరించిందని తెలిపారు. పదేళ్లు బి ఆర్ ఎస్ , రెండేళ్ల కాంగ్రెస్ పార్టీల పాలనను కాదని బీజేపీ కి ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు. ఉమ్మడి పాలమూరులో  బిజెపి బలోపేతమౌతున్నదని పేర్కొన్నారు.గతంతో పోల్చితే భారీగా పెరిగిన బీజేపీ గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలు ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇరవై పైగా స్థానాలలో స్వల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంలో  బీజేపీ బలపరిచిన అభ్యర్థులు నిలిచారని తెలిపారు పలు చోట్ల బీజేపీ మద్దతుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని,రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యామ్నా య శక్తిగా భావిస్తున్నారని అన్నారు.

బిజెపికి  గ్రామాల్లో మంచి ఆదరణ వచ్చిందని 2028 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర బీజేపీ సర్కార్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మి బిజెపి పక్షాన ప్రజలు నిలుస్తున్నారని అన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ గ్రామాలకు రూపాయి నిధులు ఇవ్వలేదనీ, గత ప్రభుత్వం సర్పంచ్ లకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదని. కాంగ్రెస్, బి ఆర్ ఎస్  ప్రభుత్వాల మోసాలతో ప్రజలు విసిగిపోయా రన్నారు. తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ కు అవకాశం ఇచ్చేనందుకు ప్రజలు సిద్ధమౌతున్నారనీ అన్నారు.