calender_icon.png 21 July, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

65 రోజులు.. 74 మ్యాచ్‌లు

17-02-2025 12:23:03 AM

  • మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ తొలిమ్యాచ్
  • తలపడనున్న కోల్‌కతా జట్లు
  • ఉప్పల్ వేదికగా 9 మ్యాచ్‌లు
  • మార్చి 23న రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ తొలిమ్యాచ్

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 క్రికెట్ అభిమానులను అలరించనుంది. మొత్తం 65 రోజుల పాటు 74 మ్యాచ్‌లు జరగనున్నా యి. తొలి మ్యాచ్ మార్చి 22న డిపెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లమధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది.

ఇదే గ్రౌండ్‌లో మే 23న క్వాలిఫయర్ మే 25న ఫైనల్ జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మే 20న క్వాలియర్ మ్యాచ్, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.

గతేడాది రన్నరఫ్‌గా నిలిచిన హైదరాబాద్ మార్చి 23న ఉప్పల్ వేదికగా రాజస్థాన్‌తో తొలి పోరులో ఆడనుంది. మొత్తంగా ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 13 వేదికల్లో  మెగా లీగ్ నిర్వహించబోతున్నారు. విశాఖ వేదికగా 2 మ్యాచ్‌లు జరగనున్నాయి.