21-09-2025 12:28:49 AM
-‘వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్’ ఆధ్వర్యంలో శిక్షణ
-జీహెచ్‌ఎంసీ మద్దతు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర ప్రభు త్వం సంయుక్తంగా యువత సాధికారతకు నడుం బిగించాయి. క్వియర్ బంధు అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన లాభాపేక్షలేని సంస్థ వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ అణగారిన వర్గాల సాధికారత, యువత నాయకత్వాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన శిక్షణ కార్యక్రమా లకు మద్దతు నిస్తున్నాయి. ఇందులో భాగం గా 20 మంది ఉద్యోగార్థులకు డిజిటల్ లిటరసీ, ప్రొఫెషనల్ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చా రు.
వారిలో ఆరుగురికి ఇండస్ట్రీ గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందించారు. తదుపరి దశలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ సందర్భంగా 1.5 మ్యాటర్స్ అనే ప్రచారం గురించి చర్చ జరిగింది. వాతావరణ పరిరక్షణ, సస్టైనబిలిటీపై యువతలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ ప్రచారం సాగుతోంది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (హెల్త్‌ఎన్యుఎచ్‌ఎం) ఎస్ పంకజా, సూపరింటెండింగ్ ఇంజనీర్ రమాదేవి లంక తదితర అధికారులు శుక్రవారం ఉద్యోగార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.