calender_icon.png 20 November, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లలో స్లాట్ బుకింగ్ ఎత్తివేయాలి

20-11-2025 12:27:59 AM

గజ్వేల్, నవంబర్ 19: రైతులు పండించిన పత్తిని పూర్తిస్థాయిలో, ఆంక్షలు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బి ఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ పరిధిలోని సాయి బాలాజీ కాటన్ మిల్లులో పత్తి కొనుగోలను ఆయన టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సీసీఐ పరిమితుల కారణంగా మిగిలిన పత్తిని రైతులకు దళారులకు అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడిందని, దీంతో రైతులు ప్రతి క్వింటాలుకు రూ.2 వేల నష్టం చవిచూస్తున్నారని తెలిపారు.

గత కెసిఆర్ హయాంలో ఆంక్షలు లేకుండా ఎకరానికి 13 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచామని గుర్తుచేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుందని, అయితే ఈ సంవత్సరం యూరియా కొరతతో పాటు భారీ వర్షాల కారణంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం దారుణమని, స్లాట్ బుకింగ్ చేసుకోవడంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్లాట్ బుకింగ్ లేకుండా పత్తి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్కు మూడు కోట్లు మంజూరు చేశామని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చెబుతున్న తీరు అర్థరహితమని, గజ్వేల్ మార్కెట్కు వచ్చిన రూ. 8 కోట్ల ఆదాయం నుండే నిధులు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మండల అధ్యక్షుడు బెండ మధు, మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, వైస్ చైర్మన్ జగియౌద్దీన్, సర్పంచులు దయాకర్ రెడ్డి, ఎంపిటిసి అశోక్, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, మరికంటి కనకయ్య, శ్యామల మల్లేశం, మామిడి శ్రీధర్, గంగిశెట్టి రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, బొగ్గుల చందు, అహ్మద్ రజనీకాంత్, లక్ష్మణరావు, భాస్కర్, దయానంద్ రెడ్డి, రఘుపతి రెడ్డి, ప్రవీణ్, పర్వేజ్, సోషల్ మీడియా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.