calender_icon.png 9 July, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రంలో రికార్డులను పరిశీలించిన సిడిపిఓ

08-07-2025 10:25:33 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం అంగన్వాడి కేంద్రంలో మంగళవారం ఐసిడిఎస్ రామన్నపేట ప్రాజెక్టు అధికారి వెంకటరమణ రికార్డులను పరిశీలించారు. అనంతరం అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారుల బరువును కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలోని రికార్డులను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ... ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరినీ తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని, అంగన్వాడి కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ రాపోలు సునీత, ఆయా పుష్పమ్మ పాల్గొన్నారు.