08-07-2025 10:23:57 PM
తిమ్మాపూర్ (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలు మంగళవారం ముగిసినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి(Principal Shobharani) తెలిపారు. ఈనెల 1 నుంచి ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎల్ఎండిలోని బి ఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ఆయా పాఠశాల కళాశాలల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి వారికి కంప్యూటర్లో ఎన్రోల్మెంట్ కాపీని అందజేసినట్లు పేర్కొన్నారు. తదనంతరం విద్యార్థిని విద్యార్థులు తాము ఏ కళాశాలలో చేరాలనుకున్న వెబ్ ఆప్షన్ లో కళాశాలలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఈనెల 1 నుంచి 8 వరకు ఎప్సెట్ 2025 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 4298 విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల, కరీంనగర్ లో ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులు ఆయా ఇంటర్నెట్ కేంద్రాలలో వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని కోరారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో హెచ్ ఓ డి చంద్ర ప్రకాష్, స్టాఫ్ మనోజ్,తో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.