calender_icon.png 9 July, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

08-07-2025 10:30:23 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేశారని గుర్తు చేసుకున్నారు. నేటి తరం నాయకులకు వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రోల్ మోడల్ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణ్చుకోలేని వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.