calender_icon.png 16 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో దూరిన పాము

16-08-2025 12:32:50 AM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండలోని కేయూ 100 పిట్ల రోడ్డు ప్రాంతం వైపు గోకుల్ నగర్ వైపు నుండి వస్తున్న కారు ఎదురుగా నాగుపాము బుసలు కొడుతూ కారుకు అడ్డంగా ఉండడంతో పామును గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా ఆందోళన గురై కారు నిలపాడు. ఆగిన కారు ఇంజన్లోకి పాము దూరడంతో భయాందోళన డ్రైవర్ తీసుకొని కారు నుండి దిగి పరుగులు తీశాడు. ఈ సంఘటన సమ్మయ్య నగర్ ప్రాంతంలో జరిగింది. సంఘటన స్థలానికి స్థానికులు చేరుకొని, పాములు పట్టే అతనికి ఫోన్ చేయడంతో కారు వద్దకు చేరుకున్న పాములు పట్టే వ్యక్తి చాకచక్యంగా పామును పట్టుకొని సంచిలో వేసి దూర ప్రాంతంలో వదిలేశాడు.