calender_icon.png 16 August, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం సేవలు అమోఘం

16-08-2025 12:32:22 AM

గుండాల, ఆగస్టు 15(విజయక్రాంతి): ప్రముఖ న్యాయవాది గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఎంఎ రహీం తన సొంత గ్రామానికి చేస్తున్న సేవలు అమోఘం అని ఆ గ్రామ కొనియాడుతున్నారు. తన సొంత గ్రామంలో79వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్య్రానికి  పూర్వం మహనీయుల త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు.

విద్యార్థులకు వాటర్ బాటిల్, ఐడికారడ్స్, స్టడీ చైర్స్, డిస్క్ బెంచీలు, క్రీడాకారులకు టీ షర్టులనులను బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ ఎం ఎ రహీం మా గ్రామంలో పుట్టడం అదృష్టం, తను చేస్తున్న మంచి పనులు మాకు ఆదర్శం అంటూ ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఆయనలాగే సొంత గ్రామానికి సేవ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.