calender_icon.png 12 October, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సమరసతామూర్తి

11-10-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

మోహన్‌సింగ్ గారు ఆదర్శ అధ్యాకులు మాత్రమే కాదు, గొప్ప రచయిత. తెలుగులోనూ, హిందీలోనూ ఎన్నో అమూల్యమైన గ్రంథాలు రచించారు. ఆయన కవిత్వం కూడా మృదు మధురంగా ఉండి అందరినీ అలరిస్తుంది. వారి రచనల్లో ‘హిందీ సాహిత్య్ కా ఇతిహాస్’ ఉద్గ్రంథం. అది వారికి సాహిత్య చరిత్ర పట్ల గల నిర్మాణ దక్షతను తెలియజేస్తుంది. తెలంగాణ అంటే వారికెంతో అభిమానం. 

ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో ఆచార్య మోహన్‌సింగ్ గారంటే అందరికీ గౌరవం. ఆయన అజాతశత్రువు కనుకనే అందరూ వారిని గౌర వించేవారు. అధ్యాపకునిగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి ఆచార్య పదవిని అ ధిరోహించిన మోహన్‌సింగ్‌గారెంతటి తప స్సు చేశారో అర్థం చేసుకోవచ్చు. మోహన్ సింగ్ గారికి నేను విద్యార్థినయ్యే అవకాశం కోల్పోయాను. కొల్కలపల్లి, మాడ్గుల మం డలంలో చదవిన నా తోటి విద్యార్థులందరూ వెలుదండకు వెళ్లి వారికి శిష్యుల య్యారు.

కానీ నేను నల్గొండ జిల్లాలోని చింతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చేరాను. కానీ వారి శిష్యులందరూ ఊ రికి వచ్చినప్పుడల్లా వారి గురించి గొప్పగా చెప్పేవారు. తెలుగు మాతృభాషగా గల్గిన మోహన్‌సింగ్ అచ్చమైన హిందీ విద్వాంసులు. నాకాశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే వారినే సభలో చూసినా తెలుగులో మాట్లాడి మాతృభాషాభిమానాన్ని చాటుకునేవారు. తెలుగులోనూ, హిందీలోనూ అనగా ఉభయ భాషల్లో వారికి గల ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచేది.

ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా

ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఒక పాలమూరు అధ్యాపకుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఎన్నికై ఓయూ పాలక మండలిలో భాగస్వాములై పరిపాలనలో, సంబంధిత అధికారులకు సలహాలిచ్చే స్థాయికి ఎదిగారంటే సాధారణమైన విషయం కాదు. నేను కొల్కులపల్లి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉస్మాని యా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య పదవిలో ప్రవేశించాను. 

తెలుగు శాఖ అధ్యక్షునిగా వారు ఆర్ట్స్ కళాశాలలో ఉన్నప్పుడు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అంటే విశ్వవిద్యాలయానికి సగం వీసీ అనే అభిప్రాయం ఉంది. మోహన్‌సింగ్ గారు అటు అకడమిక్‌గా, ఇటు పరిపాలకుడిగా మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరు విశ్వవిద్యాలయంలో అధిరోహించిన పదవులు అన్నీ ఇన్నీకావు.

ఓయూ విద్యార్థి సంఘానికి డీన్‌గా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం, వారు అవంతి డిగ్రీ, పీజీ కళాశాలల కు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. అలసట ఎరుగని మోహన్‌సింగ్ గారు హైదరాబాద్ హిందీ అకాడమీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఓయూ తులసీ భవన్ భక్తి సాహిత్య పరిశోధనా కేంద్రానికి అధ్యక్షులుగా ఉన్నారు.‘సంకల్య’ హిందీ త్రైమాసిక పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.

సాహిత్యం పట్ల దక్షత

మోహన్‌సింగ్ గారు ఆదర్శ అధ్యాకులు మాత్రమే కాదు, గొప్ప రచయిత. తెలుగులోనూ, హిందీలోనూ ఎన్నో అమూల్యమై న గ్రంథాలు రచించారు. ఆయన కవిత్వం కూడా మృదు మధురంగా ఉండీ అందరి నీ అలరిస్తుంది.  వారి రచనల్లో ‘హిందీ సాహిత్య్ కా ఇతిహాస్’ ఉద్గ్రంథం. అది వారికి సాహిత్య చరిత్ర పట్ల గల నిర్మాణ దక్షతను తెలియజేస్తుంది. తెలంగాణ అం టే వారికెంతో అభిమానం. అందుకే వారి కలం నుంచి ‘తెలంగాణ ఔర్ అన్స్ కవితాంయే’ అనే కవితా సంకలనం వెలువ డింది.

తెలుగులో వారెన్నో రచనలు చేశా రు. అవన్నీ వారి ఉత్తమ సాహిత్యాభిమానానికి, మహోన్నతమైన వ్యక్తిత్వానికి నిద ర్శనంగా నిలిచాయి. ‘భారతీయ జ్ఞాన్‌పీఠ్ బహుమతి గ్రహీతలు’..‘ ఆశాలయం’..‘ ఓ రామ! నీ నామమెంతో రుచిరా’.. ‘కృష్ణంవందే జగద్గురుమ్’..‘ ఈ మట్టి గొప్పది’ మొదలైన రచనలు వారి బహుముఖీనమైన ప్రజ్ఞాపాటవాలను తెలియజేస్తుంది. మోహన్‌సింగ్ గారు కవి, రచయిత, గొప్ప పరిశోధకుడు.

వారి పర్యవేక్షణలో 22 మంది పిహెచ్.డి డిగ్రీలు, 25 మంది ఎంఫిల్ డిగ్రీలు తీసుకున్నారు. వారి సంపాదకత్వంలో 25 గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. మోహన్‌సింగ్ గారికి, వారు చేసిన సాహిత్య సేవకు గాను ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు లభించాయి. ఎంఏ హిందీలో స్వర్ణ పతకద్వయాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం చేత ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’పొందా రు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ‘జన్మభూ మి అవార్డు’ పొందారు. ‘మహాత్మాగాంధీ మోమోరియల్ జాతీయ పురస్కారం’ అందుకున్నారు. ‘హిందీ సాహిత్య సమ్మేళన్ (అలహాబాదు) వారి చేత బహుమతి ని పొందారు. మెగాసిటీ గోల్డన్ జూబ్లీ పురస్కారం అందుకొన్నారు. ఈ పురస్కారాల తో పాటు వారు పొందిన బిరుదులు అనే కం ఉన్నాయి. వాటిలో ‘విద్యా మార్తాం డ్’.. ‘హిందీ రత్న’ ముఖ్యమైనవి.

విద్యాసాగర్ (గౌరవ డాక్టరేట్) అందుకున్న మో హన్ సింగ్ గారెంతటి సాహిత్య కృషీవలు రో తెలుసుకోవచ్చు. అన్నిటికంటె విశేషంగా పద్మశ్రీ మోటూరి సత్యనారాయణ అవార్డు రూపంలో లక్ష రూపాయల పారితోషికాన్ని పొందడం పాలమూరు జిల్లా చేసుకున్న అదృష్టమే.

మహోన్నత వ్యక్తిగా

మోహన్‌సింగ్ గారు మానవతావాది. పేదల పట్ల కరుణ కల్గిన వారు. తోటి అ ధ్యాపకుల చేత వారివలె గౌరవింపబడిన వారిని నేను నా జీవితంలో చూడలేదు. వారినొక్క తోటి అధ్యాపకులే కాదు, విద్యార్థులు, అధికారులందరూ గౌరవించేవారు. ఆయన నా దృష్టిలో ‘సామాజిక సమరసతామూర్తి’ భాషా సామరస్యాన్ని, మతసా మరస్యాన్ని సాధించడంలో ఆయన అంద రి కంటే ముందున్న వారని నిస్సందేహం గా చెప్పవచ్చు. ఇట్టి మహోన్నతవ్యక్తితో కలిసి ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఇరవై ఏండ్లు పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

వారి  రచనల్లో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఒకటి. దానికి పీఠిక రా సే అదృష్టం నాకు కలిగినందుకు నేనెంతో ఆనందించాను. మోహన్‌సింగ్ గారు తాను నిర్వహించిన అన్ని పదవులకు వన్నె తెచ్చారు. తెలుగు, హిందీ భాషా సాహిత్యాలకు సేవ చేశారు. పల్లె, పట్నం అనే భేదాలు పాటించకుండా అధ్యాపకత్వాన్ని దైవమిచ్చిన వరంగా భావించి, అందులోనే జీవించిన మహానుభావులు.

వ్యాసకర్త సెల్: 9885654381