11-10-2025 12:00:00 AM
శెగ్గారి వరుణ్ :
వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో అణచివేతను సైతం లెక్కచేయకుండా అవిశ్రాంత కృషి, అసాధారణమైన ధైర్యసాహసాలతో పోరాడింది. చీకటిలో ప్రజాస్వామ్య దీపాన్ని వెలిగించిన యోధురాలు మరియా కొరీనా మచాడో అని నోబెల్ కమిటీ కొనియాడింది. ఆమె పోరాటానికి ప్రతీకగా నోబెల్ శాంతి బహుమతి ఆమె చెంత వాలిందని పేర్కొంది.
అణచివేత, బెదిరింపులకు భయపడకుండా తాను అనుకున్న లక్ష్యం దిశగా సాగిన ధీర వనిత మరియా కొ రీనా మచాడో. ప్రజాస్వామ్య హక్కుల కో సం తాను సమిదలా మారి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ధైర్యశాలి. ‘నా దే శం కుప్పకూలుతుంటే నేను ఇంట్లో ఉండి చూడలేను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి. బుల్లెట్లకు బదులు బ్యాలెట్లను ఎంచుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ అని 25 ఏళ్ల క్రితమే తాను చేసి న వ్యాఖ్యలు ఇవాళ ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని తెచ్చిపెట్టాయి.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో 338 మంది అభ్యర్థులు, వివిధ సంస్థలు పోటీ పడితే వారినందరినీ దాటుకొని వెనిజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరా టం చేసినందుకు మరియా కొరీనా మచా డో 2025 నోబెల్ శాంతి బహుమతిని గె లుచుకున్నారు. ‘నోబెల్ పురస్కారంతో నా పోరాటం ఆగిపోదు. నేను సాధించాల్సింది చాలా ఉంది. అయితే ఇది నా గెలుపు ఎంతమాత్రం కాదు. వ్యక్తిగతంగా నేను దీనికి అర్హురాలిని కాదు. ఇది సమాజం మొత్తం సాధించిన విజయం.
మా ప్రజల కు లభించిన అతిపెద్ద గుర్తింపు’ అని మ రియా పేర్కొన్నారు. -వెనిజులా ప్రజల ప్ర జాస్వామ్య హక్కులను ప్రోత్సహించడం లో అణచివేతను సైతం లెక్కచేయకుం డా అవిశ్రాంత కృషి, అసాధారణమైన ధైర్యసాహసాలతో పోరాడింది. చీకటిలో ప్రజా స్వామ్య దీపాన్ని వెలిగించిన యోధురాలు మరియా కొరీనా మచాడో అని నోబెల్ కమిటీ కొనియాడింది. ఆమె పోరాటానికి ప్రతీకగా నోబెల్ శాంతి బహుమతి ఆమె చెంతన వచ్చి వాలింది అని పేర్కొంది.
ఎంపీ పదవి నుంచి తొలగింపు
మరియా కొరీనా మచాడో 1967 అక్టోబర్ 7న వెనిజులా రాజధాని కరాకస్‌లో జన్మించారు. తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్. తండ్రి హెన్రిక్ మచాడో జులావోగా స్టీల్ వ్యాపారవేత్త. ఈమె ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1992లో ఆమె ‘అతెనియా ఫౌండేషన్‌ను స్థాపించి వీధి పిల్లల సంక్షేమం కోసం పనిచేసింది. 2002లో ‘సుమాతే’ అనే సంస్థను స్థాపించి స్వేచ్ఛా ఎన్నికల కోసం ప్రజలను సంఘటితం చే సింది.
2010లో పార్లమెంటు సభ్యురాలి గా రికార్డు ఓట్లతో ఎన్నికైన ఆమెను 2014 లో ప్రభుత్వం బహిష్కరించింది. అయినా ఆమె తన పోరాటం ఆపలేదు. 2017లో ‘Soy Venezuela’ వేదికను ఏర్పాటు చే సి ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆమె విజయవంతమయ్యారు 2002లో మరియా కొరీనా ‘సుమాతే’ స్వ చ్ఛంద సంస్థకు కో ఫౌండర్‌గా పనిచేస్తున్న సమయంలో దేశంలో ప్రజల ఓటింగ్ హక్కులు కాపాడేందుకు, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం ఎంతో పోరాటం చే శారు.
దాదాపు పదేళ్ల పాటు ఆమె ఈ స్వచ్ఛంద సంస్థతో ఆమె కలిసి పనిచేశారు. ఆ తర్వాత 2013లో ‘వెంటె వెనిజులా’ అనే పేరుతో లిబరల్ పొలిటకల్ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేసిన మరియా.. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలుపొందారు. అలా 2011 లో మొదటిసారిగా జాతీయ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014లో వెనిజులాలో అధిక ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల కొరత, అధ్యక్షుడు నికోలస్ మదురో నేతృత్వంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.
నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న క్రమంలో పనామాలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న మరియా వెనిజులాలో ఉన్న పరిస్థితుల గురించి ప్రసంగం చేశారు. దీంతో అధికారపక్ష నాయకులు ఆమెపై తీవ్రంగా ఆగ్ర హం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి ప్రభుత్వం ఆమెను బలవంతంగా ఎంపీ పదవి నుంచి బహిష్కరించింది. పలు కేసు లు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత 2014 నుంచి 2021 వరకు మరియా ఓ స్థానిక రేడియో స్టేషన్‌లో ప్రసారకర్తగా కూడా పనిచేశారు.
అవిశ్రాంత పోరాటం
ఆ తర్వాత 2023లో తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. విపక్ష పార్టీ ప్రైమరీ ఎన్ని కల్లో 90 శాతం మెజార్టీ సాధించారు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆమె నికోలస్ మదురోకు పోటీగా బరిలోకి ది గారు. కానీ తనపై ఉన్న కేసులు, ఇతర కారణాలు చూపించి అక్కడి ప్రభుత్వం ఆమెపై 15 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది. ఆ దేశ సుప్రీంకోర్టు కూడా దీనికి మద్దతిచ్చింది. ఈ క్రమంలోనే ఆమె అధ్యక్ష ఎన్ని కల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్ అయ్యింది.
అయినా అధైర్యపడకుండా మరో అభ్యర్థి ఎడ్ముండో గోన్సాలెజ్ ఉర్రుతియాకు మద్ద తు ఇచ్చి ప్రజాస్వామ్య పోరాటాన్ని కొనసాగించింది. ఎన్నికల సమయంలో వం దలాది మంది వలంటీర్లు ఆమె పిలుపుతో బూత్‌ల వద్ద కాపలా కాశారు. హింస, బెదిరింపులు మధ్య కూడా ఓటు హక్కు, నిజాయితీ గల ఎన్నికల కోసం ఆమె నిలిచిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.
తనపై అనర్హత వేటు పడినప్పటికీ కూడా మరి యా తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. తన కెరీర్ మొత్తంలో మరియా వెనిజులాలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, చట్ట పాలన కోసం వాదిస్తూ హ్యూగో చావెజ్, నికోల్స్ మదురో పాలనలను తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరఫున నిత్యం పాటుపడేవారు. ఎప్పటికప్పుడూ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చే పట్టేవారు.
జీవితమే ఒక పాఠం
ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి ‘ఐరన్ లేడీగా గుర్తింపు పొందారు. టైమ్ మ్యాగజైన్-2025లో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో మరియా కొరీనా మచాడో చోటు దక్కించుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం శ్రమించిన మరియా కొరీనా 2014 లో చార్లెస్ టి.మనాట్ ప్రైజ్‌తో పాటు 2019లో లిబరల్ ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ ప్రైజ్ సొంతం చేసుకున్నారు.
ఇక ఈ ఏ డాది జనవరిలో కూడా మరియా ను భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు వా ర్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెను విడుదల చేసినట్లు తెలిసింది. అప్పటినుంచి ఆమె ప్రజల పోరాటానికి సంబంధించిన ఆందోళనల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ప్రజలను చైతన్యం పరుస్తూ పోరాడుతున్నారు. నిరంతరాయంగా ప్రజల కోసం ఆమె చూపిన తెగువ, ధైర్య సాహసాలు ఎంతోమందికి స్పూర్తినిచ్చాయని నోబెల్ అకా డమీ పేర్కొంది.
ఈ క్రమంలోనే ఈ ఏ డాది తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అయితే శాంతి బహుమతి కోసం తనతో పోటీ పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరియా కొరీనా ప్రశంసలు కురిపించడం కొసమెరుపు. ప్రశం సలు కురిపించడమే గాక ఈ పురస్కారా న్ని వెనిజులా ప్రజలతో పాటు తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు అంకితమిస్తున్నట్లు పేర్కొనడం ఆమె ఔదార్యాన్ని చూపిస్తుంది.
చివరగా మరియా తన జీవితంలో అలుపెరగని పో రాటం చేసి ప్రపంచానికి ఒక శాంతి పా ఠంలా నిలిచారు. శాంతి అంటే బలహీనత కాదు, అది ధైర్యం. ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యం ఎప్పటికీ ఉనికి కోల్పోదని మరి యా చూపిన దిశ మనకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటుంది.
వ్యాసకర్త సెల్: ౯౯౧౨౮౬౪౯౭౩