calender_icon.png 11 July, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోశాల భూ నిర్వాసితులకు సంఘీభావం

11-07-2025 12:57:02 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం

చేవెళ్ల/మొయినాబాద్, జూలై 10: చేవెళ్ల నియోజకవర్గం  మొయినాబాద్ మున్సిపాలిటీ, ఎన్కెపల్లి గ్రామం సర్వే నెంబర్ 180 విస్తీర్ణం 99:14 (99 ఎకరాల 14 గుంటలు)లో గో శాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పునుకుంద. రైతులకు ఎకరాకు 300 గజా లు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు అంగీకరించని రైతులు ఎకరాకు 1000 (వేయి) గజాలు చొప్పున భూమి ఇవ్వాలని పట్టుబెట్టారు.

ఈ నేపథ్యంలో భూమి కోల్పోతున్న రైతులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... భూమికి రాత్రింబవళ్లు కాపలావుంటు  అదే సర్వే నెంబర్ 180లో ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే గురువారం బిజెపి జిల్లా నాయకులు స్థానిక నాయకులతో కలిసి రైతులకు సంఘీభావం తెలిపా రు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర సర్కార్ రైతులత భూమి స్వాధీనం చేసుకుని పెత్తందారులకు అక్రమంగా కట్టబెట్టాలని చూస్తున్నదని జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ అన్నారు.

రైతుల డిమాండ్ నెరవేర్చకుండా పోలీస్ పహారాలో భూమి పూజ చేయడం ఏంటని ప్రశ్నించారు. గోశాల పేరిట  ప్రభుత్వం అవలం బిస్తున్న వైఖరి పట్ల వారు మండిపడ్డారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం దృష్టి లో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం, జిల్లా ధార్మిక శాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేశపల్లి వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకులు కంజర్ల ప్రకాష్ తదిరులు పాల్గొన్నారు.