13-12-2024 04:12:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని అనంత గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పసివుద్దీన్ అన్నారు. పాఠశాలలో 230 మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ వారికి సరిపడా నీటి వనరులు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం వల్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. నేటి సమస్యలు పరిష్కరించాలని వారు అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోశెట్టి దిగంబర్ శంభు పాల్గొన్నారు.