calender_icon.png 12 January, 2026 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ అమలుచేయాలి

11-01-2026 12:00:00 AM

దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల నిరసన

ఎల్బీనగర్, జనవరి 10 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి  అమలు చేస్తామని అధికారంలోకి రాగానే నిరుద్యోగులను మోసం చేశారని  నిరుద్యోగులు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని శనివారం సాయంత్రం మలక్ పేట - దిల్ సుఖ్ నగర్ రోడ్ పై బైఠాయించి, ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.

ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నోటిఫి కేషన్ వేయకుండా ఖాళీలను ఎప్పుడు భర్తీ చేశారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన భర్తీలను  కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని  గొప్పలు కొడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభు త్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో నిరుద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.