calender_icon.png 5 July, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూఎస్ స్టూడెంట్ వీసాలపై ‘టైం లిమిట్’

03-07-2025 01:27:05 AM

భారతీయ విద్యార్థులకు తీవ్ర నష్టం

న్యూఢిల్లీ, జూలై 2: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం మరో సంస్కరణ తె చ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇన్ని రోజు లు స్టూడెంట్ వీసాలకు ఉన్న ఫ్లెక్సిబుల్ సిస్టమ్‌ను పరిమిత కాలానికి మార్చాలని డిపార్ట్‌మెంట్ ఆప్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది. దీంతో ఎఫ్-1, జే-1 వీసాలపై అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే స్టూడెంట్ వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్‌ను అమెరికా కఠినంగా అమలు చేస్తోంది.

ప్రస్తుతం ఎఫ్-1 వీసాలపై అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులు, జే-1 వీసాలపై వచ్చిన ఎక్సేంజ్ విజిటర్లకు ‘డ్యురేషన్ ఆఫ్ స్టేటస్’ వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ వెసులు బాటుపై గడువు విధించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ విభాగం సిద్ధమైంది. ఈ గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.