05-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 4 (విజయక్రాంతి): వానాకాలం వ్యవసాయ సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆధునిక వ్యవసాయ శాస్త్ర పరిజ్ఞా నం అందించి, రైతులను ప్రోత్సహించడంమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.
ఇందు లో భాగంగా మంచిర్యాల జిల్లాలో రెండు బృందాలుగా రైతు అవగాహన కార్యక్రమా లు ఈ నెల 5 నుంచి జూన్ 16వ తేదీ వర కు రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు శాస్త్రవేత్తలు సాగు విషయాలపై రైతు వేదికలలో రైతులకు అవగాహన కార్యక్రమాలతో రైతులను చైతన్యప రిచేందుకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
మొదటి బృందంతో ఈ నెల 5న బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల, 16న హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామపంచాయతీ కార్యాలయం, 20న కాసిపేట మండలం ముత్యంపల్లి రైతు వేదిక, 27న మందమర్రి మండలం సారంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం, జూన్ 4న తాండూర్ మండలం గంపలపల్లి ప్రభుత్వ పాఠశాల, 13న భీమారం మండలం పోతనపల్లి గ్రామంలో అవగాహ న కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రెండవ బృందంతో ఈ నెల 8న నెన్నెల మండ లం కర్జి గ్రామపంచాయతీ కార్యాలయం, 14న హాజీపూర్ మం డలం టీకనపల్లి ప్రభుత్వ పాఠశాల, 23న కాసిపేట మండలం మల్కపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం, 29న మందమర్రి మండలం పులిమడుగు గ్రామంలోని ప్రభుత్వ పాఠశా ల, జూన్ 6న తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం, 11వ తేదీన భీమిని మండల కేంద్రంలోని రైతు వేదికలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
శాస్త్రవేత్తలతో చైతన్య కార్యక్రమాలు
-జిల్లాలో నకిలీ విత్తనాలు, అధిక మోతాదులో ఎరువుల వినియోగం కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల ద్వారా రైతు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం. సీజన్ సమయంలో రైతుల వద్దకే శాస్త్రవేత్తలను పంపించి సమస్యలకు పరిష్కార మా ర్గాన్ని చూపించేందుకు ప్రణాళిక రూపొందించాం. రైతు వేదికల ద్వారా ప్రతి వారం శాస్త్రవేత్తలతో ముచ్చటించే కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు.
కల్పన, డీఏఓ, మంచిర్యాల