18-11-2025 10:05:26 PM
వేదమంత్రోత్సవాల మధ్య స్వామివారికి జలాభిషేకం
గరిడేపల్లి (విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం అయ్యప్ప స్వామి దేవాలయంలో పంబారట్టు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు .అయ్యప్ప భక్తులు స్వామివారిని కలశాలతో పంబారట్టు కార్యక్రమానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అయ్యప్ప స్వామి భక్తులు మహిళలు మేళతాళాలతో భజనలతో సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న తాళ్ల చెరువు వద్దకు తీసుకువెళ్లి స్వామివారికి జలాభిషేకం చేశారు. అనంతరం మంగళవారం రాత్రి అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలాధారణ ధరించిన అయ్యప్ప భక్తులంతా పడిపూజ నిర్వహించారు. హైదరాబాదు నుంచి వచ్చిన ప్రత్యేక వేద పండితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు,మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.