10-09-2025 12:00:00 AM
-ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
-ఎర్రుపాలెం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన డిప్యూటీ సీఎం
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశా రు. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్కమల్లు మంగళవారం మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పర్యటించి పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఎర్రుపాలెం ఎస్సీ కాలనీలో 45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, పెద్ద గోపవరం గ్రామంలో 12 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు, పెద్ద గోపవరం గ్రామం ఎస్సీ కాలనీలో 85 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, బుచ్చిరెడ్డి పాలెం గ్రామం ఎస్సీ కాలనీలో 40 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, బనిగండ్లపాడు గ్రామం ఎస్సీ కాలనీలో కోటి 75 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, అయ్య వారిగూడెం ఎస్సీ కాలనీలో 55 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాలకు, భీమవరం గ్రామంలో 20 లక్షలతో నిర్మించనున్న గ్రా మపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసారు.
డిప్యూటీ సీఎం ప ర్యటనకు గ్రామాల్లో జనం తరలివచ్చి డప్పు చప్పులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో డిప్యూటీ సీఎంపై పూల వర్షం కురిపించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం ఆలోచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని భట్టి అన్నారు.