12-07-2025 08:32:38 PM
8 సెల్ ఫోన్లు, రూ 6,450.. సీజ్
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని తాడ్వాయి పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎస్సై మురళి పేకాట ఆడుతున్న ప్రదేశానికి వెళ్లి 8 మందిని పట్టుకొని వారి నుంచి 8 సెల్ ఫోన్లు రూ. 6,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న వారిలో ముసుకు సంగారెడ్డి, చెట్టే సాయిలు, బండి లింగం, ఆకిటి రాజిరెడ్డి, జావీద్ మరాటి గంగాధర్, నర్సింలు గంగారాములు ఉన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.