calender_icon.png 13 July, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ తగదు

12-07-2025 08:18:48 PM

సస్పెన్షన్ రద్దు చేసి విధులలోకి తీసుకోవాలి..

తలకొండపల్లి: అంకితాభావంతో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహిస్తున్న తలకొండపల్లి మండలం(Talakondapally Mandal) గట్టుఇప్పలపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి అనితను విధుల నుండి సస్పెన్షన్ చేయడం తగదని తలకొండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎదుల రాజులు అన్నారు. గట్టుఇప్పలపల్లి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయితీలలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను అందజేశారని చెప్పారు. ట్రాక్టర్ల నిర్వాహనకు గత ప్రభుత్వంలో నిధులు కేటాయించారని అన్నారు. రాష్ట్రంలో అదికారం మారి 19 నెలల క్రితం కాంగ్రేస్ పార్టీ అదికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

గ్రామ పంచాయతీల పదవికాలం ముగిసి 15 నెలలు ఐయిందని అప్పటి నుంచి గ్రామ పంచాయితీల నిర్వహణకు ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాలేదని ఆరోపించారు. ట్రాక్టర్ల నిర్వహణ కష్టసాద్యం కావడంతో గత నెల ట్రాక్టర్ ను నిలిపివేసి తాళం చెవులను ఎంపిడిఒ కార్యాలయంలో అందజేసినట్లు తెలిపారు.విశయం గ్రామాస్తుల దృష్టికి రావడంతో వెంటనే గ్రామంలో చర్చించి ట్రాక్టర్ నిర్వాహనకు నిదులు సేకరించాలని తీర్మానించినట్లు చెప్పారు.

గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో గ్రామంలో రూ.11,500 లను సేకరించి పంచాయతీ కార్యాలయంలో అందజేసినట్లు చెప్పారు. ట్రాక్టర్ కోసం నిదుల సేకరణలో పంచాయతీ  కార్యదర్శి అనితకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నిదుల సేకరనను సాకుగాచూపి కార్యదర్శి అనితను సస్పెన్షన్ చేయడం ఉన్నాతాదికారులకు తగదన్నారు. అనితను వెంటనే విదులలో చేర్చుకోవాలని లేని ఎడల జిల్లా పంచాయతీ అదికారి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని చంద్రశేఖర్ రెడ్డి,రాజులు హెచ్చరించాలు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ జయమ్మ వెంకటయ్య, జంగయ్య, కృష్ణయ్య. శరత్ చంద్రశర్మ,మండల కృష్ణయ్య,ఇట్యాల రవీందర్,నర్సింహ, విజేందర్, పురుషో త్తం తదితరులు పాల్గొన్నారు.