12-07-2025 08:12:43 PM
కరీంనగర్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.